World Cup 2023 : నేడు మూడు వార్మప్ మ్యాచ్‌లు..

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సన్నాహక మ్యాచుల్లో భాగంగా ఇవాళ మూడు వర్మప్ మ్యాచులు జరగనున్నాయి. ఆఫ్గనిస్తాన్vsశ్రీలంక, భారత్vsనెదర్లాండ్స్, పాకిస్తాన్vsఆస్ట్రేలియా మ్యాచ్లు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్నాయి. నిన్న జరిగిన వార్మప్ మ్యాచుల్లో సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పై ఇంగ్లాండ్ విజయం సాధించాయి.

ఇది ఇలా ఉండగా అక్టోబర్ 5వ తేదీ నుండి ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లు ఎంతో అట్టహాసంగా మరియు ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ఈ వరల్డ్ కప్ టైటిల్ ను ఎలాగైనా గెలుచుకోవాలని మొత్తం 10 దేశాలు ఎన్నో ప్రణాళికలను రచించుకుని సమరానికి సిద్ధం అవుతున్నాయి. అక్టోబర్ వ తేదీ మొదటి మ్యాచ్ జరగనుండగా, నవంబర్ 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ కు ముహూర్తం ఖరారు అయింది. ఇక తాజాగా క్రికెట్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సరి వరల్డ్ కప్ ఎటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు లేకుండానే మొదలు కాబోతోందని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news