నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరుగనుంది. ఓటుకు నోటు కేసు విచారణను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసు లో రెండు పిటిషన్లు ఏపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేశారు. అయితే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లలో స్పష్టంగా తెలిపారు ఏపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.
తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు ఏపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. ఇక అటు నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణ విచారణకు రానున్నాయి. ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు.