రేపు రావిర్యాలలో మెగా డెయిరీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

-

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ ‘డెయిరీ’ తెలంగాణలో కొలువుదీరింది. రాష్ట్రంలో పాడిరంగం ప్రగతిపథంలో కొత్త పుంతలు తొక్కేలా కేసీఆర్ సర్కార్‘మెగా’ డెయిరీని సిద్ధం చేసింది. రోజుకు 8 లక్షల లీటర్ల పాలశుద్ధితో పాటు 10 టన్నుల నెయ్యి, 10 వేల లీటర్ల ఐస్‌క్రీం తయారీ సామర్థ్యంతో.. తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీ అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మెగా డెయిరీ ప్రారంభం కానుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మెగా డెయిరీని ప్రారంభించనున్నారు. 5 లక్షల 8 లీటర్ల ప్రాసెసింగ్ సామర్ధ్యంతో…… దేశంలోనే అత్యాధునిక, పూర్తిస్థాయి ఆటో మిషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సాయంతో దీనిని నిర్మించారు.

ఈ మెగా డెయిరీ నిర్వహణ కోసం సౌరశక్తి ఉత్పత్తి వ్యవస్థతోపాటు వ్యర్ధాల వినియోగం ద్వారా.. విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేయడం ప్రత్యేకం. రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్ పాల ఉత్పత్తి, నెలకు 30 టన్నుల వెన్న తయారీ సామర్థ్యం, రోజుకు 10 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటైంది.

Read more RELATED
Recommended to you

Latest news