నేడు ఢిల్లీకి డికే శివకుమార్, సిద్ధరామయ్య..గురువారమే ప్రమాణ స్వీకారం

-

నేడు ఢిల్లీకి డికే శివకుమార్, సిద్ధరామయ్య వెళ్లనున్నారు. కర్ణాటక సీఎం ఎవరు అవుతారనే దానికి ఉత్కంఠ ఉన్న తరుణంలో.. నేడు ఢిల్లీకి డికే శివకుమార్, సిద్ధరామయ్య వెళ్లనున్నారు. నేడు డీకే శివకూమార్ పుట్టిన రోజు…డికే పుట్టిన రోజు గిఫ్ట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తాందా ? లేదా అన్న టెన్షన్ లో డికే అనుచరులు ఉన్నారు.

తన పుట్టిన రోజు నాడు సోనియాకు గెలుపు గిఫ్ట్ ఇస్తానని గతంలో చెప్పారు డికే. డికె కి అధిష్ఠానం ఊహించని గిఫ్ట్ ఇస్తుందని సోషల్ మిడియాలో డికే అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇదే నా ఆఖరి ఎన్నిక అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, దక్షిణ భారతదేశంలో రాజకీయంగా బాగా బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటకలో ఓటమి పాలైంది బిజేపి. 30 ఏళ్ళ తర్వాత స్థానాల సంఖ్యను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే, అదనంగా ఈసారి 55 అసెంబ్లీ స్థానాలను గెలుపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news