ధరలు తగ్గేలా చూడు స్వామీ.. దేవుడికి టమాటా దండతో పూజలు

-

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా టమాటా పేరే వినిపిస్తోంది. ఏ సోషల్ మీడియా పేజ్ చూసినా టమాటా మీమ్సే కనిపిస్తున్నాయి. ఇక రోజురోజుకు పెరుగుతున్న ఈ కూరగాయ ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఇక మేం కొనలేం బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నారు. అయితే ఏ కష్టమొచ్చినా దేవుడితో చెప్పుకోవడం మనకున్న అలవాటే కదా. అలాగే తమిళనాడు నాగపట్టిణం జిల్లాలో టమాటా ధరల గోడును దేవుడికి విన్నవిస్తూ అక్కడి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రత్యేకం అంటే అలాంటిలాంటిది కాదు.. ఏకంగా 508 టమాటాలతో ఓ దండను తయారు చేసి.. దేవతా విగ్రహాలను అలంకరించారు. పూలు, నిమ్మకాయల మాలను సైతం దేవుళ్లకు సమర్పించుకున్నారు. మరియమ్మన్, నాగమ్మన్, మధురై వీరన్ స్వామికి​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖశాంతులతో ఉండాలని, టమాటా ధరలు తగ్గాలని భక్తులు భగవంతులను వేడుకున్నారు.’ఆడి’ మాస పౌర్ణమి సందర్భంగా గరుకుడి పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు భక్తులు. నాగపట్టిణం, తిరువారూర్, కారైకల్, మైలాడుతురై ప్రాంతాల నుంచి భక్తులు ఈ పూజలకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news