BREAKING : తెలంగాణ అసెంబ్లీ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు తెలంగాణ పోలీసులు.. నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని…ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది యూత్ కాంగ్రెస్ పార్టీ.
అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డితో, నగర అధ్యక్షుడు మోటా రోహిత్ పాటు ఇతర నేతలను అడ్డుకున్నారు పోలీసులు. అటు అసెంబ్లీ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..పోలీసు స్టేషన్ కు తరలించారు.
కాగా,తెలంగాణ శాసనసభ రేపటికి (శుక్రవారం) వాయిదా వేశారు స్పీకర్. సభ ప్రారంభమయ్యాక దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం తెలుపుతూ ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, దానం నాగేందర్, ఇతర ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి సభను రేపు 10 గంటలకు వాయిదా వేశారు.