BREAKING : ఈ రోజు చంద్ర గ్రహణం ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ చంద్ర గ్రహణం.. మొత్తం ఒక గంట 19 నిమిషాల పాటు ఉంటుందట. ఈ రోజు చంద్ర గ్రహణం ఉన్న తరుణంలో.. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుందని పండితులు ప్రకటించారు. గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2.23 గంటలకు ఉంటుందట.
అంటే మొత్తం గా ఒక గంట 19 నిమిషాల పాటు గ్రహణం సమయం ఉంటుందన్న మాట. భారత్ తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించనుంది చంద్ర గ్రహణం. ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
- గ్రహణ సమయంలో చేయకూడని పనులు….
* గర్భిణీలు ఇంటి నుండి బయటకు రాకూడదు.
* గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు.
* గ్రహణకాలంలో పూజలకు దూరంగా ఉండాలి.
* కూరగాయలు తరిమేందుకు కత్తి వంటి సాధనాలను దూరంగా ఉంచాలి.
* గ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండాలి.
* ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే రాబోయే 15 రోజులు ఇబ్బంది కలుగుతుంది.