ఇదెక్కడి మాస్ మావా.. ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకునేందుకు నదిలో డ్రైవింగ్‌

-

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వేళ వరుస సెలవులతో హిమాచల్‌ ప్రదేశ్లో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. మనాలి, అటల్‌ టన్నెల్‌ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచు కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు కొన్నిగంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఈ ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు పర్యాటకులు సాహసం చేశారు. రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా నదిలో నుంచి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని లహాల్‌ వ్యాలీలో గల చంద్రా నదిలో నుంచి కొందరు ప్రయాణికులు సోమవారం సాయంత్రం థార్‌ ఎస్‌యూవీలో ప్రయాణించారు. ఆ సమయంలో నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వాహనానికి చలానా వేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని స్థానిక ఎస్పీ తెలిపారు. నదీ ప్రాంతంలో సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news