ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలు.. మోడీ స్ట్రాంగ్ కౌంటర్

-

భారత్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డెడ్ ఎకానమీ అంటూ ఆయన చేసిన విమర్శలపై భారత ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతోందని మోడీ తెలిపారు. అంతేకాదు ట్రంప్ టారిఫ్ ల వేళ స్వదేశీ ఉత్పత్తులను పెంచాలంటూ పిలుపునిచ్చారు.

pm modi

తాజాగా ప్రధాని మోడీ వారణాసిలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. అన్ని దేశాలు తమ తమ ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. భారత్ కూడా త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుంది. అందువల్ల ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాల పై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనపెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలి. కేవలం భారతీయులు తయారుచేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి అని మోడీ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news