టీటీడీ ఆధ్వర్యంలో జమ్మూలో నిర్మించిన శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవం ఇవాళ జరగనుంది. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి హాజరుకానున్నారు. ఈనెల 3 నుంచి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శివాలిక్ అటవీ ప్రాంతంలో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్ల వ్యయంతో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ వెంకన్నతో పాటు 17 దేవత మూర్తులను ప్రతిష్టించినట్లు అధికారులు తెలిపారు. కాగా, నిన్న మహారాష్ట్ర ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరు అయ్యారు. కాగా, ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు రేమండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారు.