మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్ పుత్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సౌరభ్ భార్య ముస్కాన్ గర్భవతి గా నిర్దారణ అయింది. జైలు అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా ఆసుపత్రి నుంచి ఒక టీమ్ సోమవారం జైలులో ఆమెకు పరీక్సలు చేసింది. ఈ పరీక్సల్లో ముస్కార్ రస్తోగి గర్భవతి అని తేలింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా ముస్కాన్ ప్రెగ్నెన్సీని ధృవీకరించారు.
గత నెలలో మీరట్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ఉన్న సౌరభ్ రాజ్ పుత్ తన కుమార్తె పుట్టిన రోజు కోసం భారత్ వచ్చిన సమయంలో అతని భార్య ముస్తాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి దారుణంగా హత్య చేశారు. కత్తితో పొడిచి గొంతు కోసి హతమార్చారు. ఆ తరువాత డెడ్ బాడీని 15 ముక్కలుగా చేసి డ్రమ్ లో పెట్టి సిమెంట్ తో కప్పేశాడు. హత్య తరువాత ముస్తాన్, సాహిల్ కలిసి విహారయాత్రకు వెళ్లారు. సౌరభ్ కనిపించడం లేదని అతని కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్కాన్, సౌరబ్ 2016లో ప్రేమ వివాహ చేసుకున్నారు. గత మూడేళ్లుగా ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. సౌరభ్ లండన్ లో పని చేస్తున్నాడు. ఈ తరుణంలోనే ముస్కాన్, సాహిల్ మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది.