మంకీ ఫీవర్‌ కలకలం.. కర్ణాటకలో ఇద్దరు మృతి

-

మొన్నటిదాక కరోనా.. ఆ తర్వాత దాని వేరియంట్లు ప్రపంచాన్ని భయపెట్టిన విషయం తెలిసిందే. ఇక మరోసారి మంకీ ఫీవర్ కోరలు చాస్తోంది. భారత్ లో ఈ వైరస్ సోకి తాజాగా ఇద్దరు మరణించారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు (79) మంకీ ఫీవర్ తో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ రణ్‌దీప్‌ తెలిపారు. శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలపై ఆరా తీశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 48 మందికి మంకీ ఫీవర్‌ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.

కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందని రణ్ దీప్ తెలిపారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఈ వైరల్ లక్షణాలను వెల్లడించారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్‌ వేయించేందుకు ఐసీఎంఆర్‌ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version