మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం గ్రామీ. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఇవాళ అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ దీనికి వేదిక అయింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పాటలు పాడి అలరించారు.
అయితే ఈ అంతర్జాతీయ సంగీత వేదిక (గ్రామీ పురస్కారాలు)పై భారతీయ సంగీత విద్వాంసులు తమ సత్తా చాటారు. ఈ అవార్డుల కార్యక్రమంలో భారత్ కు ఓ పురస్కారం వరించింది. ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్ట్లు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’.. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ పాటను జాన్ మెక్ లాగ్లిన్ (గిటార్), జాకిర్ హుస్సేన్ (తబ్లా), శంకర్ మహదేవన్ (సింగర్), వి సెల్వగనేశ్ (percussionist), గనేశ్ రాజాగోపాలన్ (violinist) ఇలా మొత్తం 8 మంది కలిసి కంపోజ్ చేశారు. భారతీయ సంగీతం గొప్పదనాన్ని విశ్వ వేదికపై చాటిన వీరికి ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.