తెలంగాణలోని 18 ఏళ్లు నిండిన వారికి అలర్ట్

-

తెలంగాణలోని 18 ఏళ్లు నిండిన వారికి బిగ్‌ అలర్ట్. ఓటర్ల నమోదు కోసం ఆగస్టు 26, 27 తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జూలై నాటికి 3,06,42,529 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి మొదలుకానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలు మొదలవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news