కుప్పకూలిన దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జి.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

-

బిహార్లోని సుపాల్ నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్ద వంతెన కుప్పకూలింది. మూడు పిల్లర్ల గర్డర్లు కూలిపోయిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా బిహార్లోని మధుబని, సుపాల్ మధ్య బకూర్ దాదాపు రూ.1200 కోట్ల వ్యయతో వంతెనను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 10.2 కిలో మీటర్లు పొడవు ఉండే ఈ వంతెన పూర్తయితే దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జిగా అవతరిస్తుంది. ఇది అసోంలోని భూపేన్ హజారికా వంతెన కంటే కిలోమీటర్ పొడవు ఉంటుంది. మొత్తం 171 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిలో ఇప్పటికే 150 పిల్లర్లు నిర్మించి, పూర్తైన పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 50,51, 52 పిల్లర్లపై ఏర్పాటు చేసిన గర్డర్లు కూలిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news