వైసీపీకి కొత్త అస్త్రం దొరికింది. టీడీపీని TeluguDrugsParty అంటూ ట్రోలింగ్ చేస్తోంది వైసీపీ పార్టీ. విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ దొరికింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు.. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీలు చేసింది. ఈ తరుణంలోనే.. 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌తో కలగలిపి కొకైన్ దిగుమతి జరిగినట్లు గుర్తించారు.. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరిట డెలివరీ అయినట్లు అధికారులు తేల్చారు.ఈ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి.. ఆయన తండ్రి వీరభద్రరావు ఎండీగా గుర్తించారు.
బీజేపీ నేత పురందేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి.. టీడీపీ నేతలతోను, బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. టీడీపీ హయాంలో అక్రమాలకు ‘సంధ్యా ఆక్వా’ తెగపడ్డట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే..విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్‌తో బయటపడిన దొంగలతో అడ్డంగా టీడీపీ నేతలు దొరికినట్లుగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
ఈ డ్రగ్స్ స్కాంలో టీడీపీ నేతలకు నేరుగా లింకులు ఉన్నాయని…టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు & రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరి కి దగ్గర సంబంధాలు ఉన్నాయని వైసీపీ చెబుతోంది. ఈ కేసులో లోకేష్, చంద్రబాబుకు నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.