పంజాబ్‌రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త కవలలు విడివిడిగా ఓటు వేశారు. వారు అవిభక్త కవలలు అయినప్పటికీ సోహ్నింగ్, మోహ్నసింగ్ తొలిసారిగా అమృత్ సర్‌లోని మానావాలాలో తమ ఓటు వేశారు. నడుం వరకు ఒకే శరీరం.. రెండు తలలు ఉన్న వీరిద్దరినీ ఇద్దరూ ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వారికి ఓటు హక్కు కల్పించింది. ఒకే శరీరాన్ని పంచుకుంటున్న ఈ సోదరులకు తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరి ఓటు గోప్యంగా వేయాలి కదా.. ఇద్దరూ వేర్వేరు ఓటర్ల మధ్య గోప్యత పాటించాలి కదా.. అందుకే పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఆర్వో వారికి ప్రత్యేకమైన కళ్లజోడు ఏర్పాటు చేసారు. ఒకరు ఓటు వేసేటప్పుడు మరొకరు కళ్లజోడు పెట్టుకుంటూ ఓటే శారు. ఇది చాలా ప్రత్యేకమైన కేసు అని, దీనిపై వివాదం రాకుండా వారు ఓటు వేసేది ప్రత్యేకంగా వీడియోగ్రఫీ కూడా చేయించారు. వారు ఒకే శరీరంతో కలిసి ఉన్నా.. ఇద్దరూ వేర్వేరు ఓటర్లను అందుకే గోప్యత కోసం కళ్లజోడు ఇచ్చాం అని ఆర్వో వెల్లడించారు.