ఉక్రెయిన్ వదిలి రండి… రష్యా- ఉక్రెయిన్ మధ్య ఘర్షణపై భారత్ కీలక నిర్ణయం

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిణామాలు ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. ఎప్పుడైనా రష్యా, ఉక్రెయిన్ పై దాడి చేసే అవకాశం ఉందంటూ అగ్ర రాజ్యం అమెరికా హెచ్చిరస్తోంది. అనుమానాలకు బలం చేకూరేలా… ఉక్రెయిన్ సరిహద్దులు, బెలారస్ దేశాల్లో రష్యా భారీగా యుద్ధవిన్యాసాలను నిర్వహిస్తోంది. బాలిస్టిక్ క్షిపణులను పరీక్షిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా మద్దతుదారులు, ప్రభుత్వ బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. దీంతో ఎప్పుడు ఎలా పరిస్థితులు మారుతాయే చెప్పడం కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ తమ పౌరులు ఉక్రెయిన్ దేశాన్ని వదిలి రావాల్సిందిగా కోరింది. విమానాల అప్ డేట్ కోసం విద్యార్థులు స్టూడెంట్ కాంట్రాక్టర్లను సంప్రదించాలని పేర్కొంది. సహాయం కోసం భారత రాయబార కార్యాలయం ఫేస్ బుక్, వైబ్ సైట్, ట్విట్టర్ ఫాలో కావాలని సూచించింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో అయినా రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గుతాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news