ఈనెల 23న కేంద్ర బడ్జెట్.. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కీలక ప్రకటన

-

18వ లోక్‌సభ  కొలువుదీరిన విషయం తెలిసిందే. జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇక తొలి సమావేశాలు ముగియడంతో ఇప్పుడు కేంద్రం బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు  శనివారం ప్రకటించారు. ఆగస్టు 12 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  సభలో ప్రవేశ పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news