స్టాలిన్ సర్కార్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తండ్రి సీఎం…కొడుకు డిప్యూటీ సీఎం అంటూ ఉదయ్ నిధి స్టాలిన్ కు పదవి రావడంపై ఆగ్రహించారు కేంద్రమంత్రి బండి సంజయ్, కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకేసహా కుటుంబ పార్టీల్లో కార్యకర్తలకు ముఖ్య పదవులివ్వరా? అంటూ మండిపడ్డారు.
కుటుంబ, వారసత్వ పార్టీలను బొంద పెట్టండి అంటూ ఆగ్రహించారు కేంద్రమంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయని ఆగ్రహించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. మూసీ పేరుతో కాంగ్రెస్ రూ.లక్షణ్నర కోట్ల దోపిడీకి తెరదీసిందని మండిపడ్డారు. జీతాలకే పైసల్లేవు… మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఫైర్ అయ్యారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే…ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలనా? అని మండిపడ్డారు.