మా పార్టీలను చీల్చమని అమిత్ షా చెప్పారు : ఉద్ధవ్ థాక్రే

-

సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్‌షాపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే సీరియస్ అయ్యారు.‘ఇటీవలే నాగ్‌పూర్‌లో పర్యటించిన అమిత్‌షా.. మహారాష్ట్ర బీజేపీ కీలక నేతలతో ఒక అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు.ఉద్ధవ్ థాక్రే,శరద్ పవార్ పార్టీలను మరింతగా చీల్చమని బీజేపీ శ్రేణులకు అమిత్ షా సూచించారు’ అని ఉద్ధవ్ ఆరోపించారు.‘విపక్ష పార్టీల నేతల మధ్య చిచ్చుపెట్టడం, చీల్చడం అనే కుట్రల గురించి రహస్య సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఏముంది? నేరుగా ప్రజల ముందే అమిత్‌షా చెప్పి ఉండాల్సింది’అని ప్రశ్నించారు.

మహారాష్ట్రలోని రాంటెక్ నగరంలో ఛత్రపతి శివాజీ విగ్రహా ఆవిష్కరణ అనంతరం ఉద్ధవ్ మాట్లాడుతూ.. ఉద్ధవ్, శరద్ పవార్‌లకు చెందిన పార్టీలు బలహీనపడితే మహారాష్ట్రను దోచుకునేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అవుతుందని అమిత్ షా భావిస్తున్నారన్నారు.ఇతర పార్టీలను చీల్చేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ.. హిందుత్వ వాదనతో ఆర్ఎస్ఎస్ గొంతు కలుపుతుండటంపై ఉద్ధవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news