ప్యాసింజర్‌ రైళ్ల వల్ల మిగిలేది నష్టాలే : కేంద్ర మంత్రి

-

ప్యాసింజర్‌ రైళ్ల వల్ల భారతీయ రైల్వేకు లాభాలు రావడం లేదని ఆ శాఖ సహాయమంత్రి రావ్‌సాహెబ్‌ దన్వే అన్నారు. ప్రజల సౌకర్యం కోసం మాత్రమే సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు. ప్యాసింజర్‌ రైళ్ల వల్ల లాభం కంటే నష్టాలే వస్తున్నాయని.. ఈ నష్టాన్ని గూడ్సు రైళ్ల ద్వారా భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.

బిహార్‌లోని ఛాప్రా నుంచి మహారాష్ట్రలోని జల్నా మధ్య వీక్లీ స్పెషల్‌ రైలును కేంద్ర మంత్రి దన్వే ప్రారంభించారు. పాసింజర్‌ రైళ్ల వల్ల ప్రతి రూపాయికి  55 పైసల చొప్పున నష్టం వాటిల్లుతోంది. కానీ, మోదీ ప్రభుత్వం లాభాల గురించి పని చేయడం లేదు. ప్రజల సౌలభ్యం కోసం రైళ్లను కచ్చితంగా నడపాలని మోదీ సూచించారు. ప్రయాణికుల రైళ్ల వల్ల వచ్చే నష్టాలను గూడ్సు రైళ్లు, ఇతర మార్గాల ద్వారా భర్తీ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

జల్నా-ఛాప్రా మధ్య రైలు మరాఠా ప్రజల చిరకాల కోరిక అని దన్వే చెప్పారు. ప్రస్తుతానికి వీక్లీ ట్రైన్‌గా నడుపుతామని.. వారంలో రెండు మూడు రోజులు నడిపేలా భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version