ఉపఎన్నికల వేళ సీఎం యోగీకి షాక్.. యూపీలో బీజేపీలో ముసలం

-

ఉప ఎన్నికల వేళ ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీలో ముసలం మొదలైంది. సీఎం యోగీ ఆదిత్యనాథ్కు షాక్ ఇచ్చేలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యంతో ఉత్తర్‌ ప్రదేశ్‌ బీజేపీలో చెలరేగిన కలకలం రోజురోజుకు ముదురుతోంది. ఓటమిపై ఇటీవల పార్టీ నేతల భిన్న వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే.

దానికి కొనసాగింపుగా అన్నట్లు తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య దిల్లీలో ఒంటరిగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, మౌర్యకు మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వైఫల్యంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై వారు చర్చించినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించేందుకు కృషి చేయాలని ఆయనకు నడ్డా సూచించినట్లు తెలిసింది.

‘పార్టీ అనేది ప్రభుత్వం కంటే గొప్పది. కార్యకర్తల బాధే నా బాధ. ఏ ఒక్కరూ పార్టీ కంటే పెద్దవారు కాదు. కార్యకర్తలు పార్టీకి గర్వకారణం. నా ఇంటి తలుపులు ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంటాయి. నేను ఉప ముఖ్యమంత్రి కావడం తరవాతి సంగతి. అంతకంటే ముందు నేను పార్టీ కార్యకర్తను. కార్యకర్తలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గౌరవించాలి’ అని ఎక్స్‌లో కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పోస్టు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news