గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టండి: భారత్

-

ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజాలో వరుస దాడులకు పాల్పడుతూ పౌరుల ప్రాణాలకు హాని కలిగిస్తోంది. ఆ దేశం చేస్తున్న దాడులతో గాజా విలవిలలాడుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతి చెందారు. వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్, హమాస్లకు సూచిస్తున్నాయి. అయినా అవి పట్టించుకోవడం లేదు.

హమాస్‌ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న దాడుల్లో ఎంతోమంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణను పాటించాలని భారత్ మొదటి నుంచి పిలుపునిస్తోన్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి వేదికగా తాజాగా మరోసారి తక్షణమే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు భారత్ పిలుపునిచ్చింది. అలాగే బేషరతుగా బందీలను విడుదల చేయాలని హమాస్‌ను మన దేశం డిమాండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news