దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలలో వ్యాక్సిన్ సర్టిఫికేట్ మోడీ ఫోటో లేకుండానే జారీ చేయాలని అధికారులను కేంద్ర ఆరోగ్య శాఖ అదేశించింది. ఆ ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ రావడంతో నే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగ వచ్చే నెల 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు విడతల్లో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణీపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాలలో సాధారణ అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి.
దీనికి సంబంధించిన షెడ్యూల్ ను గత శనివారమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎన్నికల సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పై మోడీ ఫోటో ఉంటే.. ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పలు పార్టీల నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అందు కోసం కోవిన్ యాప్ లో కూడా అవసరం అయ్యే మార్పులు చేశారు. ఇదీల ఉండగా గతంలో కూడా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సమయంలో ఇలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల పై మోడీ ఫోటోను తొలగించారు.