రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడంపై వెంకయ్య నాయుడు సంచలన ప్రకటన

-

రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడంపై వెంకయ్య నాయుడు సంచలన ప్రకటన చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్యనాయుడును అభినందించారు ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు,జర్నలిస్టులు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించా..అందుకే రాలేదు.. కానీ ప్రజా జీవితంలో ఆక్టీవ్ గా ఉంటానన్నారు.

Venkaiah Naidu

ప్రజా సమస్యలను,ఇతర అంశాలను నిన్న కూడా ప్రధానితో చర్చించానని వెల్లడించారు. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళను…సాధారణ రాజకీయాల గురించి స్పందిస్తానని వెల్లడించారు. వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని.. ఎవరి పని వారు సక్రమంగా చేయడమే దేశ భక్తి అన్నారు.
నేతలు పార్టీలు మారడం ట్రెండ్ గా మారింది…ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్ అన్నారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరోచ్చు… పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదని ఫైర్‌ అయ్యారు వెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news