Fact Check: బంగ్లాదేశ్ కు ఇండియన్ ఆర్మీ… క్లారిటీ ఇదే !

-

బంగ్లాదేశ్ లో చాలా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వదిలి పారిపోయారు. దీంతో అక్కడ పరిస్థితులన్నీ చేతులు దాటిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు. ఈ ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. అయితే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు చెలరేగి నిరసనలతో బగ్గుమంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Video Shows Indian Army Entering Violence Hit Bangladesh via West Bengal To Suppress Protests

ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఆందోళనకారులను… కంట్రోల్ చేసేందుకు ఇండియా ఆర్మీ వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్లిందని కొంతమంది వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో ఇది నిజమే అని కొంతమంది ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో 2022 నాటిదని.. లేటెస్ట్ వీడియో కాదని.. క్లారిటీ ఇచ్చింది కేంద్రం. కావాలని కొంతమంది ఇప్పుడు ఆ వీడియోలను షేర్ చేస్తున్నారని మండిపడింది. బంగ్లాదేశ్ కు ఎలాంటి సహాయం చేయలేదని… కేంద్రం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news