వైరల్ వీడియో:ఒక్కడి కోసం రంగంలోకి దిగి కాపాడిన ఆర్మీ…!

-

దేశం మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, అసోం రాష్ట్రాలు భారీ వరదలతో అతలాకుతలం అవుతూ ఉన్నాయి. అక్కడి ప్రభుత్వాలు వరదల సహాయక చర్యల విషయంలో తల మునకలు అవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఉన్న చత్తీస్ఘడ్ లో కూడా వర్షాలు జన జీవనాన్ని స్తంభింపచేసాయి.

వరదల్లో చిక్కకున్న వారి కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్ లు కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నది ప్రవాహంలో చిక్కుకున్న వారిని కాపాడటానికి ఆర్మీ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) ఛాపర్ ఛత్తీస్‌గడ్ ‌లోని బిలాస్‌పూర్ సమీపంలోని ఖుతాఘాట్ ఆనకట్ట వద్ద ఒక వ్యక్తిని రక్షించింది. ఆనకట్టలో భారీ ప్రవాహం ఉన్నందున, సహాయక చర్యలను చేపట్టాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని కోరగా వారు రంగంలోకి దిగి ఒక వ్యక్తిని కాపాడారు.

Read more RELATED
Recommended to you

Latest news