బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ కేంద్రం అధికారులు చెప్పారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి సూచించారుగవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్. అలాగే అప్రమత్తమైన అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.