సచిన్ టెండూల్కర్‌ నా హీరో : విరాట్ కోహ్లీ ఎమోషనల్‌

-

సచిన్ టెండూల్కర్‌ నా హీరో అంటూ టీమిండియా క్రికెటర్‌ విరాట్ కోహ్లీ ఎమోషనల్‌ అయ్యారు. వరల్డ్ కప్ లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. టీమిండియా తాజాగా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్లో 243 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 327 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు 83 పరుగులకే ఆల్ అవుట్ చేశారు.

virat kohli comments on sachin tendulkar

రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టారు. శమి, కుల్దీప్ చరో 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. కాగా, సచిన్ 49 సెంచరీల రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ కీలక కామెంట్స్ చేశారు. ‘నా హీరో రికార్డును సమం చేయడం గొప్ప గౌరవం. అభిమానులు మమ్మల్ని పోల్చుతుంటారు. నేను ఆయనలా ఎప్పటికీ రాణించలేను. మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ లో చాలా పర్ఫెక్ట్. సచినే నా హీరో. ఇది నాకు చాలా భావోద్వేగ క్షణం. టీవీల్లో ఆయన ఆటను చూస్తూ పెరిగా’ అని ఎమోషనల్ అయ్యారు కింగ్ కోహ్లీ.

Read more RELATED
Recommended to you

Latest news