బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి ‘టేస్టీ’ తేజ ఎలిమినేషన్‌

-

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-7 రోజురోజుకు ప్రేక్షకులను మరింత అలరిస్తోంది. అయితే ఈ ఆదివారం ఈ షో నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వీక్ నామినేషన్స్‌లో అమర్‌దీప్‌, రతిక, శోభ, ప్రియాంక, అర్జున్‌, తేజ, భోలే షావలి, ప్రిన్స్‌ యావర్‌లు ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన ‘టేస్టీ’ తేజ ఎలిమినేట్‌ అయినట్లు హోస్టు నాగార్జున ప్రకటించాడు. టేస్టీ తేజ తన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో అందరినీ నవ్విస్తూ అలరించాడు. శోభా శెట్టితో కలిసి తేజ చేసిన హంగామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఇటీవల పూజా మూర్తి, సందీప్‌ మాస్టర్‌లు ఎలిమినేట్‌ కావడంలో తేజ సిల్లీ రీజన్స్‌ కూడా ఒక కారణమని ప్రేక్షకులు భావించారు. ఈ వారం జరిగిన నామినేషన్స్‌ అలాంటి కారణమే చెప్పి, తేజను శివాజీ నామినేట్‌ చేయగా.. ఓటింగ్‌లో అతడికి తక్కువ ఓట్లు పడటంతో తేజ ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news