సమంత పాటకి చిందులేసిన విరాట్ కోహ్లీ!

-

ఆర్ సి బి ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్, విని రామన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే..కాదా ఈ బుధవారం నాటికి వీరి వివాహం జరిగి ఒక నెల పూర్తి అయిన సందర్భంగా..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ బయోబబుల్ లో ఈ జంట కోసం ప్రత్యేక వేడుకను నిర్వహించింది.చాలామంది ఆర్ సి బి ప్లేయర్స్ తమ సోషల్ మీడియా ద్వారా ఈ ఫంక్షన్ లో పాల్గొన్న చిత్రాలను షేర్ చేశారు.భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి పార్టీని ఆస్వాదించారు.టాలీవుడ్ హీరోయిన్ సమంత డాన్స్ చేసిన ” ఊ అంటావా మామ” పాటకు ఆర్సిబి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టెప్పులు వేశాడు.

కోహ్లీ డాన్స్ నెట్టింట వైరల్ గా మారింది.అయితే మాక్స్ వెల్ తన చిరకాల స్నేహితురాలు అయిన విని రామన్ ను ఈ ఏడాది మార్చి 27న పెళ్లి చేసుకున్నాడు.విని రామన్ భారతీయ సంతతికి చెందిన అమ్మాయి కావడంతో భారతీయ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.పెళ్లి కారణంగా మ్యాక్స్ వెల్ ఆర్సిబి బయో బబుల్ లోకి కొంచెం ఆలస్యంగా చేరాడు.ఆర్సిబి ఆడిన తొలి మ్యాచ్ లకు కూడా మిస్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news