వరల్డ్ కప్ పై విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారని, కానీ గెల వాలనే కోరిక ఫ్యాన్స్ కంటే ప్లేయర్లలోని ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తించాలని విరాట్ కోహ్లీ అన్నారు.
ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ‘WC గెలవాలని నా కంటే ఎక్కువగా ఎవరూ కోరుకోరు. నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఆ ఛాలెంజెస్ లో WC కూడా ఒకటి. ఛాలెంజెస్ ను మనం స్వీకరించాలి. క్లిష్ట పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవాలి’ అని తెలిపారు.
కాగా, మరో రేపటి నుంచే శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా ఆసియా కప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఇందులో ఇండియా, పాకిస్తాన్ , శ్రీలంక , నేపాల్, ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక అన్ని టీం లో కసరత్తులతో సమాయత్తం అవుతున్నాయి.