బండారు లక్ష్మా రెడ్డికి టికెట్ ఎట్లా ఇస్తారు ? – ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

-

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2001 నుంచి BRS పార్టీలో ఉన్నా…ఆ రోజు ఉప్పల్ నియోజకవర్గం జెండా పెట్టుకుంది నేనేనన్నారు. BRS కనీసం నాకు టిక్కెట్ ఇవ్వడం లేదని చెప్పలేదని ఫైర్ అయ్యారు. ఉరి వేసే ముందు కూడా ఒక సారి అడుగుతారని సీఎం కేసీఆర్‌ కు చురకలు అంటించారు.

బండారు లక్ష్మ రెడ్డీ ఏమి చేసిండు ? జెండా మోసిండా? బండారు లక్ష్మ రెడ్డీ టికెట్ ఎట్లా ఇస్తారు ? అని నిలదీశారు. 2018 నుంచి సొంతంగా కార్యక్రమాలు మాత్రమే చేశారు BLR…
బండారు లక్ష్మ రెడ్డీ కాంగ్రెస్ నేతల ఫోటోలు పెట్టుకుంటున్నాడని ఆగ్రహించారు. పద్మారావు గౌడ్ నా తర్వాత వచ్చారు…అయిన మంత్రి అయ్యారని మండిపడ్డారు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. గ్రేటర్ లో నేను ఒక్కని మాత్రమే ఉద్యమకారున్నని… టికెట్ ఇచ్చే ముందు మాట్లాడలేదు…ఇప్పుడు ఇంకా మాట్లాడలేదని ఆగ్రహించారు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. ఇంతకు బండారు లక్ష్మ రెడ్డీ కాంగ్రెస్ నేత ? BRS నేత ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news