విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. అందు​లో 140 మంది ప్రయాణికులు

-

ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గాల్లో ఉండగానే కాదు.. రన్ వే పైనా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్ర ముంబయి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎయిర్​ విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన విమానాన్ని సామాన్లు తీసుకెళ్లే ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో విమానం ఇంజిన్​ దెబ్బతింది. ప్రమాద సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముంబయి నుంచి కోల్​కతాకు వెళ్లే విమానం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. విమానాన్ని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఫ్లైట్ ఇంజిన్ దెబ్బతిన్నదని.. ఇప్పుడు ఇంజిన్​కు మరమ్మతులు చేశామని వెల్లడించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసి గమ్య స్థానాలకు తరలించామని చెప్పారు. అదృష్టవశాత్తు ప్రయాణికులలెవరికి గాయాలు కాలేదని విస్తార్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ ఉద్యోగి వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version