సుకన్య సమృద్ధి ఖాతాదారులకు హెచ్చరిక.. 10 రోజుల్లో ఈ పని చేయకపోతే..!

Join Our Community
follow manalokam on social media

ఈ నెల 31వ తేదీతో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ మేరకు ఆయా రంగాలకు కేంద్రం రుణాలు, పన్నులు చెల్లించాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులకు కూడా కేంద్రం హెచ్చరిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగియకన్న ముందే ఖాతాదారులు డబ్బులు జమ చేయాలని, 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. లేకుంటే జరిమానా విధించడం జరుగుతుందని కేంద్రం హెచ్చరిస్తోంది. ఆడపిల్లల భవిష్యత్‌ కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారు సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన

రూ.250తో ఖాతా ఓపెన్..

బాలికల ఉన్నత చదువు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో ప్రాచుర్యం పొందింది. కేవలం రూ.250తో ఈ పథకంలో ఖాతా తెరుచుకోవచ్చు. ఖాతా క్లోజ్ అవ్వకుండా ఏడాదికి రూ.500 అయినా తప్పనిసరిగా జమచేయాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బులు జమ చేయకపోతే డిఫాల్ట్ ఖాతాగా పరిగణించి.. ఖాతాను క్లోజ్ చేసేస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే క్లోజ్ అయిన ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉందా.. అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఖాతాను తిరిగి యాక్టివేట్ ఎలా చేసుకోవాలో నిపుణులు తెలుపుతున్నారు.

ఖాతాను యాక్టివేట్ చేసుకోవడానికి..

సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులు.. ఒక వేళ ట్రన్సక్షన్ నిర్వహించకుండా ఉంటే ఖాతాను మూసివేస్తారు. అలా జరిగినప్పుడు స్థానికంగా ఉన్న పోస్టాఫీసు దగ్గరికి వెళ్లి ఖాతా పునఃప్రారంభానికి ఒక ఫారమ్‌ను నింపాలి. దీనితోపాటు గతంలో డబ్బులు చెల్లించకుండా ఉంటారు కాబట్టి.. ఆ బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది. అయితే రెండేళ్లుగా ఖాతా క్లోజ్ అయి ఉంటే.. రెండేళ్లకు రూ.500, జరిమానా రూ.100 చెల్లించాలి. మొత్తంగా రూ.600 చెల్లించి ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలి.

సులభంగా రూ.15 లక్షలు పొందండిలా..

మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త వడ్డీరేట్లు అందుబాటులోకి వస్తాయి. అయితే వచ్చే త్రైమాసికంలో కూడా ఈ ఆసక్తి కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ స్కీంలో ఖాతాదారులకు ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం రూ.3 వేలు లేదా రూ.36 వేలను 14 సంవత్సరం వరకు డబ్బులు జమ చేసినట్లయితే.. 7.6 శాతం వడ్డీతో స్కీం కాలం ముగిసిన తర్వాత రూ.9,11,574 లక్షలు చేతికి అందుతాయి. 21 ఏళ్ల తర్వాత రూ.15,22,221 లక్షలు చేతికి వస్తాయి. ఒకవేళ ఏడాదికి రూ.12,500 లేదా రూ.1.50 లక్షలు (గరిష్టం మొత్తం) రూపాయలను 14 సంవత్సరాలు జమ చేస్తే.. 7.6 శాతం వడ్డీతో స్కీం ముగిసే నాటికి రూ.37,98,225 లక్షలు అవుతాయి. అదే 21 సంవత్సరాలకు రూ.63,42,589 అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు భవిష్యత్ కోసం ఈ పథకంలో చేరాలని, సంవత్సరానికి రూ.500 తప్పనిసరిగా జమ చేయాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...