ఒక్క వాట్సాప్ మెసేజ్​తో.. మీ ఇంటికి గ్యాస్ సిలిండర్

-

మీకు కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా..? దాని కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారా..? అది కుదరడం లేదని లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ చేస్తూ కస్టమర్ సర్వీస్​తో విసిగిపోతున్నారా..? ఇక నుంచి అలా కష్టపడనవసరం లేదు. మీకు గ్యాస్ కనెక్షన్ కావాలన్నా.. ఏదైనా రిపేర్ కోసమైనా.. లేదా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలన్నా.. వాట్సాప్​ ద్వారా ఒక్క మెసేజ్ చేస్తే చాలు.. ఇట్టే మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చేస్తుంది.

వాట్సాప్‌లో మీకు కావాల్సిన ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు కొత్త కనెక్షన్‌ సులభంగా పొందొచ్చు. వినియోగదారుల కోసం వాట్సాప్‌ సేవలు తీసుకొచ్చినా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఆయిల్‌ కంపెనీల వాట్సాప్‌ నంబర్లతో సైతం వినియోగదారులు క్షణాల్లో బుకింగ్‌, రీఫిల్లింగ్‌, ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు మీరు హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులైతే.. ఆ సంస్థ వాట్సాప్‌ నంబరు 92222 01122లో బీi అని టైప్‌చేసి పంపగానే వచ్చే మెనూ ఆధారంగా అన్నిరకాల సేవలు పొందొచ్చు. ‘సువిధ’ ఎంపికలో కొత్త కనెక్షన్‌, కనెక్షన్‌ తొలగింపు తదితర సేవలను పొందొచ్చు.

  • హెచ్‌పీ కంపెనీ సేవలకు 92222 01122
  •  ఇండేన్‌ కంపెనీ సేవలకు 75888 88824
  • భారత్‌ గ్యాస్‌కు 18002 24344

Read more RELATED
Recommended to you

Latest news