నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల..అక్కడి నుంచే పోటీ చేస్తా – కేటీఆర్‌

-

నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల..అక్కడి నుంచే పోటీ చేస్తానని కీలక ప్రకటన చేశారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… నాకు రాజకీయ జన్మనిచ్చింది.. సిరిసిల్ల.. వందశాతం సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండటం నాకు గర్వకరణమని తెలిపారు.

కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం సిరిసిల్ల నియోజకవర్గం దొరకడం నా ఆదృష్టం అని తెలిపారు కేటీఆర్‌.అటు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్‌. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని, అన్నలాంటి వాడని, ఇద్దరి అభిరుచులు కలిసాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ఎవరి రాజకీయాలు వారివేనని స్పష్టం చేశారు. సీఎం జగన్, లోకేష్ కూడా మిత్రులేనని… ఎవరితోనూ ఇబ్బందులు లేవని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news