ఆ టీకాకు డబ్యూహెచ్‌ఓ అనుమతి..

-

కరోనా కట్టడికి ఫైజ ర్‌ – బయోఎన్‌టెక్‌ తయారు చేసిన టీకా అత్యవసర వినియోగానికి డబ్యూహెచ్‌ఓ అంగీకరించింది. ఈ అంగీకారంతో ప్రపంచమంతా ఎగుమతి చేసేందుకు లైన్‌క్లియర్‌ అయింది. ఈ క్రమంలో అగ్ర దేశాలు కూడా అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఐరోపా, ఉత్తర అమెరికాల్లో కోవిడ్‌ కట్టడికి ఈ టీకాలను ఇస్తున్నారు. అయితే ఆ దేశాల్లోని ప్రత్యేక నియంత్రణ సంస్థలు ఆ టీకాకు ఆమోదం తెలపాల్సి ఉంది. ఈక్రమంలో ఆరోగ్య సంస్థలు అంతగా పటిష్టంగా లేని పలు పేద దేశాల్లో డబ్యూహెచ్‌ఓ ఆమోదమే కీలకంగా మారింది. తాము ఫైబర్‌ టీకాను అంగీకరించడంతో ఆయా దేశాలు తమ వ్యాక్సిన్, డోసుల పంపిణీ, కొనుగోలు చేసేందుకు సౌకర్యంగా ఉంటుందని డబ్యూహెచ్‌ఓ పేర్కొంది.

 

బ్రిటన్, అమెరికాతో పాటు మరిన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ టీకా తగినన్ని భద్రతా ప్రమాణాలు కలిగి ఉన్నట్లు తాము చేసిన సర్వేలో వెల్లడైయిందని డబ్యూహెచ్‌ఓ తెలిసింది.అయితే.. అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌ టీకాను అత్యంత శీతాల వాతరవారణంలో అధిక జాగ్రత్తలు తీసుకొని నిరంతరం నిఘాతో కాపాడాల్సిన అవసరం ఉంటుంది. కాగా అన్ని వసతులు లేని పేద దేశాలకు ఈ టీకాను అందించేందుకు ఓ ఛాలెంజ్‌గా మారిందంటున్నారు. అయినా కూడా అలాంటి దేశాలపై ప్రత్యేక చొవర తీసుకోని తాము సహకారం అందిస్తాని డబ్యూహెచ్‌ఓ ఆయా దేశాలకు భరోసా ఇచ్చింది. దానికి సంబం«ధించి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు, కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news