మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి ఇప్పటికే 42 దేశాలకు పాకిపోయింది. 3,417 కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు పౌర బృందాలను సమన్వయ పరిచే వరల్డ్ హెల్త్ నెట్వర్క్ అయితే దీన్ని అంటువ్యాధి గా ప్రకటించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సంస్థ సైతం మంకీ పాక్స్ ను అంటువ్యాధిగా ప్రకటించాలన్న ప్రతిపాదనలపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది.
నిజానికి ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా మారే అంటువ్యాధులనే ప్యాండమిక్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తోంది. మంకీ పాక్స్ వైరస్ చూడ్డానికి ఎంత వేగంగా, విస్తృతంగా వ్యాపించే అవకాశాలు లేవని నిపుణుల అభిప్రాయం. ప్యాండమిక్ గా ప్రకటిస్తే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి డబ్ల్యుహెచ్వో మరింత సమయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ డబ్ల్యూహెచ్వో ప్యాండమిక్ గా ప్రకటిస్తే ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు మరింత అప్రమత్తమైన దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.