NRI టెకీకి చుక్కలు చూపించిన యువతి.. పెళ్లి పేరుతో రూ.1.14 కోట్లు టోకరా

-

మ్యాట్రిమొనీ ద్వారా పరిచయమై.. ఓ ఎన్ఆర్ఐ టెక్కీని నిలువునా ముంచేసింది ఓ యువతి. వీడియో కాల్ చేసి అతడి న్యూడ్ వీడియో రికార్డు చేసింది. ఆ తర్వాత అవి ఆ టెకీకి వాట్సాప్ చేసి బెదిరింపులు షురూ చేసింది. ఆ రకంగా అతడిని బెదిరించి ఏకంగా.. రూ.1.14 కోట్లు బ్యాంకు ఖాతాకు మార్పించుకుంది. ఆమె సతాయింపులు భరించలేక బాధితుడు స్థానిక వైట్‌ఫీల్డ్‌ పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణం స్పందించి ఆమె ఖాతాలో ఉన్న రూ.80 లక్షలు డ్రా చేసుకోకుండా కట్టడి చేశారు.

ఇదీ జరిగింది.. లండన్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్న ఆ సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్ లో భాగంగా బెంగళూరు వచ్చారు. ఇక్కడే పెళ్లిచేసుకోవాలనే ఆలోచనతో ఓ మ్యాట్రీమోనీలో తన పేరు నమోదు చేసుకోగా..సాన్వి అరోరా అనే మహిళ ఆయనకు పరిచయమైంది. ఈనెల 7న ఆమె ఆయనకు వీడియో కాల్‌ చేసి.. అతడి న్యూడ్ వీడియోలను తన ఫోన్ లో రికార్డు చేసింది. మరుసటి రోజు ఆ వీడియోలు ఆయనకు వాట్సాప్‌లో షేర్‌చేసింది. కాస్త డబ్బు ఇస్తే.. ఇవన్నీ ఎవరికీ చూపనంటూ హెచ్చరించింది. అలా.. ఏకంగా రూ.1.14 కోట్లు గుంజేసింది. ఇంకా కావాలంటూ ఆమె డబ్బు కోసం డిమాండు చేయడంతో ఠాణా మెట్లెక్కడంతో అసలు విషయం బయట పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version