20న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు..?

-

గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల 20న పార్లమెంట్ లో పెట్టే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 5 రోజుల పాటు జరుగనున్న విషయం విధితమే. అయితే ఇవాళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో జరుగుతున్నాయి. ఇక ఈ సెషన్ లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడితే బాగుంటుందని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20లో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని.. ప్రగతి భవన్ లో సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చట్ట సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో కూడా మహిళా బిల్లుపై చర్చ జరగడం గమనార్హం. మరోవైపు 6.30 పార్లమెంట్ భవనంలో సమావేశం కానుంది కేబినెట్. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news