అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం

-

భారత ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల బృందం అక్టోబర్ 3 తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా సందర్శించనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిపే ఈ పర్యటనలో ఈ బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహన సంసిద్ధతను సమీక్షించడంతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలను, స్థానిక అధికారులను సంప్రదిస్తుందని తెలిపారు.

తొలిరోజు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పర్యటనకు శ్రీకారం చుడుతుంది. త్వరలోనే జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో ఈసీఐ సమావేశం అవుతుందని వికాస్ రాజ్ అన్నారు. రెండో రోజు ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో సందసిద్ధతను సమీక్షించడంపై ఎక్కువగా ధృష్టి కేంద్రీకరిస్తుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్ పోలీస్ కమిషనర్లు ఈ బృందానికి వారి సన్నద్ధత నివేదికలను సమర్పిస్తారు అంటూ తెలిపారు వికాస్ రాజ్.

Read more RELATED
Recommended to you

Latest news