Women’s T20 World Cup 2023 : పాక్ మరియు టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ అంటే మాములుగా ఉండదు. ఈ రెండు జట్లు తలపడితే, ఆ రోజు క్రికెట్ లవర్స్ కు పెద్ద పండగే. అయితే, పాక్ మరియు టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ మరోసారి జరుగనుంది. ఈ మ్యాచ్ కు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్- 2023 వేదిక కానుంది.
ఈ నెల అంటే, ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్- 2023 సిరీస్ జరగనుంది. మొట్టమొదటి మహిళల టీ20 వరల్డ్ కప్ 2009లో జరిగింది. ప్రస్తుతం జరగబోయేది 8వ ఎడిషన్. ఈ సీజన్ లో ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య దక్షిణాఫ్రికా శ్రీలంకతో తలపడనుంది. ఫిబ్రవరి 12న భారత్, పాకిస్తాన్ తో టోర్నీని ప్రారంభించానున్నారు.
ఫిబ్రవరి 12న భారత్, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య టి20 పోరు జరగనుంది. ఈ రెండు జట్లు కూడా గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్ ‘బి’లో భారత్, పాకిస్తాన్ లతో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.
చివరిసారిగా మహిళల టి20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరిగింది. అప్పుడు భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. అయితే ఈసారి మాత్రం కప్పు కొట్టాలనే పట్టుదల మీద హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీం ఉంది. ఇప్పటికే భారత మహిళల జట్టు సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. ప్రపంచకప్ కు సన్నాహకంగా ట్రై సరీస్ ను ఆడుతుంది. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈ ట్రై సిరీస్ లో భాగంగా ఉన్నాయి.