BREAKING : ప్రపంచ జనాభా అరుదైన మైలురాయిని అందుకుంది. నేటితో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కాగా ప్రపంచ జనాభా 700 కోట్లనుంచి 800 కోట్లకు చేరేందుకు 12 ఏళ్ల సమయం పట్టింది.
2030 కల్లా 850 కోట్లకు, 2050 కల్లా 1040 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023 నాటికి చైనాను అధిగమించి, భారత్ అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనుందని పేర్కొంది. ఇక ఇటు ఇండియాలోనే ఈ 10 ఏళ్లలో జనాభా ఎక్కువగా పెరిగిందని చెబుతున్నాయి లెక్కలు. ఇలాగే కొనసాగితే.. చైనా జనభాను మన దేశం క్రాస్ చేస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.