జుకర్ బర్గ్ వాదన తప్పు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

-

ఇటీవల లోక్ సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చేసిన వాదనను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోసి పుచ్చారు. గత ఏడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాలలో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్ బర్గ్ తప్పుగా చెప్పారని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ పై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించిన అంశాన్ని గుర్తు చేసారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పై విశ్వాసం ఉందని తేల్చి చెప్పారు. కరోనా తరువాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్ బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220 కోట్ల వ్యాక్సిన్లు అందించడంతో పాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోడీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయని తెలిపారు మంత్రి అశ్విని వైష్ణవ్. 

Read more RELATED
Recommended to you

Latest news