మెకానిక్ రాకీలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించిన తర్వాత.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విరామం తీసుకోకుండా మళ్లీ యాక్షన్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం లైలా సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో లేడీ గెటప్ ధరించి అభిమానులను ఆశ్చర్యపరచనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఉత్సాహాన్ని జోడిస్తూ, మేకర్స్ ఇప్పుడు స్టైలిష్ మరియు ఫంకీ అవతార్‌లో విశ్వక్ సేన్‌ను ప్రదర్శించే కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. సినిమా ప్రేమికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా రేపు లైలా టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. జనవరి 14న ఉదయం 10:08 గంటలకు టీజర్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు విడుదల కానున్న టీజర్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.