బాడుకావ్ బలిసిందారా బొక్కలిరగ్గొడ్తా.. ఈ డైలాగ్ అందరికీ గుర్తుంది కదా. మరి అది చెప్పిన హీరోయిన్ సాయిపల్లవి గుర్తుందా అని అడగడం వేస్ట్. ఎందుకంటే ఈ నేచురల్ బ్యూటీని సినీ ప్రేమికులు ఎవరైనా మర్చిపోతారా. మరి ఆమె అందం, అభినయం అలాంటిది. తెలుగులో చేసిన తొలి సినిమా ఫిదాతోనే అందరినీ ఫిదా చేసింది సాయి పల్లవి.
ఈమె తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మెస్మరైజ్ చేసే లుక్స్‌తో కుర్రకారును పడేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ ఫిదా చేసేసింది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతోంది. విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్, లవ్‌స్టోరీ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో బిజీగా ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ నేచురల్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందానికి అడ్రస్ లా నిలుస్తోంది. కలువరేకుల్లాంటి కళ్లు, ముత్యాళ్లాంటి నవ్వులతో మాయ చేస్తోంది. పొట్టి డ్రెస్సులు వేసుకుని అందాలు ఆరబోయకపోయినా.. కేవలం తన నేచురల్ అందాలతో ఆకర్షిస్తోంది. మరి ఆమె కొన్ని ఫొటోలను మీకోసం.