ఆర్‌ఆర్ఆర్‌లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన నవదీప్

-

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్ఆర్. బారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తారనే దానిపై పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా చిత్ర బృందం ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారనే దానిపై రోజుకో రూమర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ క్రమంలోనే హీరో నవదీప్ కూడా ఆర్‌ఆర్ఆర్‌లో నటిస్తున్నారనే వార్త కూడా తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఈ వార్తలపై హీరో నవదీప్ క్లారిటీ ఇచ్చాడు. తను ఆర్‌ఆర్ఆర్‌లో నటించడం లేదని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. తనకు అలాంటి ఆఫర్ రాలేదని వెల్లడించాడు.

కాగా, రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. తమిళ, మాలయాళ చిత్ర పరిశ్రమలకు ప్రముఖ నటులు కూడా కనిపించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు జరుగుతున్న ప్రచారాలను పుకార్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తి చేసకున్న ఆర్‌ఆర్ఆర్‌.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చిత్రీకరణ నిలిచిపోయింది. అయితే ఇటీవల విడుదలైన టైటిల్ లోగోకు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news