ఆస్తులు రూ.64 కోట్లే.. అయినా అందరికంటే ధనవంతుడు

-

మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు నేతలు ఏదైనా నగర కార్పోరేషన్‌కు కార్పోరేటర్‌గా ఎన్నికైనా చాలు.. ఐదేండ్లలో 60 కోట్ల రూపాయలు అవలీలగా సంపాదిస్తారు. అంతేకాదు, మెడలో దూడ పలుపులాంటి బంగారు గొలుసు, చేతి మణికట్టుకు లావుపాటి బంగారు బ్రాస్‌లెట్, వేలుకో రకం చొప్పున అన్ని వేళ్లకు విలువైన రాళ్లు పొదిగిన ఉంగరాలు పెట్టుకుని.. పదిమంది మందబలంతో ఖరీదైన కార్లలో తిరుగతారు.

కానీ, ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి! ముఖ్యమంత్రి అంటే ఆషామాషీ ముఖ్యమంత్రి కాదండి బాబూ! గత 20 ఏండ్లుగా ఆ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి. అయినా స్థిర, చర ఆస్తులు కలిపి ఆయన సంపద విలువ ఎంతో తెలుసా.. కేవలం 64.26 కోట్ల రూపాయలు. ఇంతకూ ఎవరీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? అయనేనండీ.. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌. 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కేవలం 64 కోట్ల రూపాయలే సంపాదించడం ఆయన నిజాయితీకి నిదర్శనం అంటున్నారు ఒడిశా ప్రజలు.

నవీన్‌పట్నాయక్‌ ఆస్తుల విలువ రూ.64.26 కోట్లే అయినా.. ఒడిశా క్యాబినెట్‌లో అందరికంటే ధనవంతుడిగా ఆయనే నిలిచాడు. ఒడిశా ప్రభుత్వం బుధవారం ముఖ్యమంత్రి సహా రాష్ట్ర క్యాబినెట్‌లో 20 మంది ఆస్తుల వివరాలతో ఒక జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో సీఎం ఉండగా.. క్రీడలు, ఐటీ శాఖ మంత్రి తుషార్‌కంటి బెహెరా కేవలం రూ.26 లక్షల ఆస్తితో చివరి స్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news